మేడ్చల్: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రాకమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తూముకుంట మున్సిపాలిటీలో పర్యటించారు. తుర్కవాణి కుంట నుంచి దేవరాయాంజాల్ చెరువుకు వెళ్లే వరదకాలువ కబ్జా కావడంతో కాలనీలు నీట మునుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పరిశీలించారు. గతంలో ఎంత విస్తీర్ణంలో ఉండేదో చూసి ఆక్రమణలు తొలగించి వరద కాలువను పునరుద్ధరించాలని ఆదేశించారు.