ADB: ప్రజల సమస్యలపై బాధ్యతయుతంగా వ్యవహరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం మావల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా జరగకుండా గస్తీ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆర్థిక నేరాల కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికలకు సిబ్బంది పూర్తి సంసిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.