SKLM: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఇటీవల నగరంలో మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించి, ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన టి. సాయి (24) అనే వ్యక్తికి సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 45 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.