ELR: ఏలూరులో జిల్లా వ్యవసాయ కార్యాలయంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ శిక్షణ, డిబ్రీఫింగ్ సమావేశం జరిగింది. ప్రతి కేడర్ కనీసం ముగ్గురు రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి నడిపించాలని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాషా సూచించారు. ప్రకృతి వ్యవసాయం ఒక బ్రాండ్ లాంటిదని, దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, రైతులను ప్రోత్సహించాలని అయన కోరారు.