ELR: రాబోయే మూడు గంటల్లో ఏలూరు జిల్లాలో 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాలకు, పొలాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.