VZM: చీఫ్ జస్టిస్ B.R. గవాయ్ పై దాడిని దళిత బహుజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈమేరకు చీపురుపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాల నాయకులు బుధవారం నిరసన తెలిపారు. దేశంలోనే దళితుల ఆత్మగౌరవంపై దాడిగా పరిగణిస్తున్నామని, దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంటానా అప్పారావు, రాజు పాల్గొన్నారు.