MDK: చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈనెల 3న చోరీకి వచ్చాడని అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. జంగరాయి గ్రామానికి చెందిన మోహన్ పై పెట్రోల్ పోసి నిప్పంటించగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు వివరించారు.