PDPL: సీఐటీయూ అనుబంధంగా ముర్మూర్ మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికుల నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కీసరి తిరుపతి అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. గౌరవ అధ్యక్షుడిగా ఆడారి నర్సింగరావు, అధ్యక్షుడిగా కీసరి తిరుపతి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రామాచారి, ప్రధాన కార్యదర్శిగా బరిగెల నరేశ్ తదితరులు ఎన్నికయ్యారు.