NLG: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం గుడిపల్లి మండలం గణపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన నాయకులకు గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.