PDPL: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన రూ. 5,500 బోనస్ చెల్లించాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేశ్ డిమాండ్ చేశారు. బుధవారం సింగరేణి ఆర్జీ –1 పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డికి వినతి పత్రాన్ని ఆయన అందజేశారు. దసరా సందర్భంగా వస్తాయనుకున్న లాభాల వాటా నేటికీ అందకపోవడం బాధాకరమన్నారు.