TG: త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. ఇప్పటికే బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ ఈ ఎన్నికల బరిలోనుంచి తప్పుకుంది. కాగా నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది.