కృష్ణా: విద్యార్థులు క్రమశిక్షణతో ఉత్తమ విద్యావంతులు కావాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. బుధవారం పోరంకి జడ్పీ హైస్కూలులో అసంపూర్తిగా ఉన్న ఐదు తరగతి గదులను అనుమోలు ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అనుములు ప్రభాకర్ రూ.15లక్షల నిధులతో పూర్తి చేశారు. వీటిని ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించారు.