VZM: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకం ప్రచారంలో భాగంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు వక్తృత్వ పోటీలు బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగాయని GST జాయింట్ కమిషనర్ నిర్మలా జ్యోతి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, జీఎస్టీ ప్రయోజనాలు, వినియోగదారుల లాభాలపై తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు.