W.G: దీపావళి సందర్భంగా అక్రమంగా బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అత్తిలి తహసీల్దార్ దశిక వంశీ హెచ్చరించారు. బుధవారం ఎస్సై ప్రేమ రాజు, ఫైర్ ఆఫీసర్ గంగరాజుతో కలిసి ఆయన హోల్ సేల్ షాపుల్లో తనిఖీలు చేశారు. ప్రభుత్వ అనుమతి పొందిన షాపులు మాత్రమే క్రాకర్స్ అమ్మాలని ఆయన సూచించారు.