KNR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో మొదటి ఫేజ్లో 6 జడ్పీటీసీలు, 70 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఆర్, ఏఆర్వోలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు.