KMM: దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 నుంచి ఈ నెల 6 వరకు నిర్వహించిన లక్కీడ్రా విజేతలను బుధవారం ప్రకటించారు. ఖమ్మం కొత్త బస్టాండ్లోని రీజియన్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రయాణికుల సమక్షంలో డ్రా తీశారు. విజేతలుగా కాంతారావు (1), సాయిబాబా (2), సునీల్(3) నిలిచారు. వీరికి హైదరాబాద్లోని బహుమతులను ప్రదానం చేయనున్నారు.