ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్లో ఎస్సై మాధవరావు బుధవారం రాత్రి వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌ను చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టరీత్యా నేరమని, మద్యం తాగి వాహనాల నడిపితే రూ.10వేలు జరిమానా, జైలు శిక్ష తప్పదని ఎస్సై హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికా వద్దని సూచించారు.