ఆసిఫాబాద్: జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఇవాళ కలెక్టరేట్లో CCI, మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ, జిన్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈ ఏడాది 3.34 లక్షల ఎకరాలలో పత్తిపంట సాగు చేశారు. 38 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆయన పేర్కొన్నారు.