దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) UPI సేవల్లో అంతరాయం ఏర్పడింది. ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామంటూ యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన SBI.. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిసున్నట్లు తెలిపింది. టెక్నికల్ సమస్య వల్ల UPI వినియోగంలో సమస్యలు వచ్చాయని వాటిని పరిష్కరిస్తున్నట్లు చెప్పింది.