MBNR: ఏటీసీలో శిక్షణతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పడుతుందని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో ఉన్న ఏటీసీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రిన్సిపల్‌తో శిక్షణ గురించి తెలుసుకున్నారు.