BPT: కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా మార్కెట్ యార్డ్ ఆవరణలో భద్రపరిచిన ఈవీఎం గోదాంను ఇవాళ తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకోసారి ఈ తనిఖీ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి, వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గోదాంను తెరిచి ఆయన ఈవీఎం యంత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు.