కృష్ణా: జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2025 -26 సంవత్సరానికి సంబంధించి ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. పెనమలూరు మండలం పోరంకిలోని 3వ సచివాలయం నుంచి వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం సేకరణకు చేపట్టాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.