NLG: రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా నాణ్యమైన ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని DRDO శేఖర్ రెడ్డి సూచించారు. కనగల్ మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు రాయల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.