PDPL: యైటింక్లయిన్ కాలనీలో గత వారం రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ సురేంద్రపాల్ గుండెపోటుతో మృతి చెందగా కాలనీ ప్రెస్ భవన్ సభ్యులు బుధవారం రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబానికి సంతాపం ప్రకటించి మాట్లాడారు. పత్రికా రంగంలో ఆయన వివిధ పత్రికల్లో అనేక సేవలను అందించారని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి తీరనిలోటన్నారు.