SRPT: ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించడానికి బ్లూకోట్స్, పెట్రోకార్ సిబ్బంది సమర్థ వంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం పోలీసు స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా సూర్యాపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకుని రౌడీ షీటర్స్పై పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు.