గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందుతున్న ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, దాని అవుట్పుట్ చూసి రామ్ చరణ్ కూడా ప్రశంసించినట్లు తెలుస్తోంది. కాగా, రేపటి నుంచి ఈ చిత్రంలో చరణ్, జాన్వీ కపూర్ మధ్య ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.