KRNL: ఆదోనిలో వరదల సమయంలో తహసీల్దార్ అందుబాటులో లేక నిర్లక్ష్యం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ తెలిపారు. తహసీల్దార్ నిర్లక్ష్యాన్ని గమనించిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, బదిలీకి రంగం సిద్ధమైందన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే కాపాడే ప్రయత్నం మానుకోవాలని ఆయన కోరారు.