ADB: నామినేషన్లను నిబంధనలకు అనుగుణంగా సరైన పద్ధతిలో సమర్పించేలా అభ్యర్థులకు సహకారం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆర్జే, ఏఆర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జడ్పీ సీఈవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియను నిర్వహించుకోవాలని తెలిపారు.