VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నివాసంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం YS జగన్ ఆధ్వర్యంలో “చలో నర్సీపట్నం” ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తూ గురువారం ఉ 9 గంటలకు నర్సీపట్నంకు కార్లతో భారీ ర్యాలీని నిర్వహించి సంఘీభావం తెలుపుతున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలన్నారు.