GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు గురువారం తెనాలి 31వ వార్డులోని 36వ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయానికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన కమిషనర్ వెంటనే సిబ్బందిని పిలిపించారు. తామంతా ఫీల్డ్ వర్క్‌లో ఉన్నామని సిబ్బంది చెప్పగా, కనీసం ఒకరిద్దరైనా ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు.