NLG: చిట్యాల మండలంలోని వనిపాక MPPS పాఠశాలకు అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి పీక పృథ్వీరాజు స్మార్ట్ టీవీని బహుకరించారు. పాఠశాలకు మునుముందు కూడా తగిన సహకారాన్ని అందిస్తానని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకొని గ్రామానికి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HMO కౌసల్య, ఉపాధ్యాయులు శంకర్ రెడ్డి పాల్గొన్నారు.