WGL: భూ సమస్యలు సకాలంలో పరిష్కరించేలా చొరవ చూపాలని, నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి నర్సంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రెవిన్యూ డివిజన్లోని 6 మండలాల తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష నిర్వహించారు.