PLD: జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘చెకుముకి సంబరాలు’ ఈ నెల 18వ తేదీన పాఠశాల స్థాయిలో నిర్వహించనున్నట్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి అజయ్ బాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను ఆయన చిలకలూరిపేటలో ఆవిష్కరించారు. గత ఏడాది 7 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఈ ఏడాది మరింత పెరుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.