VZM: భోగావురం, వూసపాటిరేగ, డెంకాడ పోలీస్ స్టేషన్లను భోగాపురం సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసి, పోలీసు స్టేషను ప్రాంగణంలో పార్కింగు చేసిన వాహనాలను నూతన చట్టాల్లోని నిబంధనలు మేరకు డిస్పోజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.