MBNR: గండీడ్ మండల వ్యవసాయ అధికారిణిగా బుధవారం జీ. రాధమ్మ బాధ్యతలు స్వీకరించారు. గతంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారిణిగా పనిచేస్తున్న ఆమె పదోన్నతిపై గండీడు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.