PDPL: యైటింక్లయిన్ కాలనీ నివాసి పీఎంపీ డాక్టర్ బండారి మల్లయ్య బుధవారం మరణించగా నేత్రదానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు షాపింగ్ కాంప్లెక్స్ వర్తకులు తెలుపగా లగిశెట్టి చంద్రమౌళి నేత్రదానంపై అవగాహన కల్పించగా, కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఎల్వీ ప్రసాద్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో కార్నియాలు సేకరించి HYD ఐ బ్యాంక్ పంపించడం జరిగిందని తెలిపారు.