HYD: రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మాజీ మంత్రి మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 15న మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రారంభం కానున్న గూగుల్ డిజిటల్ క్యాంపస్ 3.0 సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను గవర్నర్కు వివరించారు.