TG: బీసీ రిజర్వేషన్ల కోసం ఎంతవరకైనా వెళ్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరుఫున హైకోర్టులో బలంగా వాదనలు వినిపించామని చెప్పారు. ఈ కేసులో వాదనలు ముగిసే వరకు ఇలానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టులో తీర్పు ఏం రాబోతుందో ఇప్పటికే అర్ధం అయ్యిందని.. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే విషయం ప్రజలకు అర్ధమైందని అన్నారు.