NRML: భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ మోసాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. డిజిటల్ నిపుణుడు డా. M.శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై సూచనలు అందించారు. అధిక లాభాల ఆశ వద్దు, వ్యక్తిగత వివరాలు పంచుకోకండని హెచ్చరిస్తూ, ఒకవేళ మోసపోతే 1930 కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.