AP: రాష్ట్ర వ్యాప్తంగా ములకలచెరువు నకిలీ మద్యం కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. కట్టా రాజు, కొడాలి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. మరో ఇద్దరు నిందితులు జనార్దన్ రావు, రాజేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.