తూ.గో జిల్లాలో ఆఫ్రికా నత్తల నిర్మూలనకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు కలెక్టరేట్లో ఉద్యాన శాఖ పనులపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సుమారు 176 హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల ప్రభావం ఉన్నట్లు గుర్తించామన్నారు.