HYD: ఇబ్రహీంపట్నం పరిధి యాచారంలోని నల్లవెళ్లిలో పిడుగు పాటుకు జోగు మనీష్ మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. 7వ తరగతి చదువుతున్న బాలుడు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. పిడుగు పాటుకు బాలుడు అక్కడక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న యాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.