CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కృష్ణాజిల్లా తిరువూరు శాసనసభ్యులు కోలికపూడి శ్రీనివాస్ రావు దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.