MHBD: కార్యకర్తలకు BRS పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే BRS పార్టీ అని డోర్నకల్ మాజీ MLA డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. కురవి మండలంలోని బలపాల గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నుండి BRS పార్టీలోకి చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి రెడ్యానాయక్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.