MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో బుధవారం ఆర్సీ తాండాకు చెందిన శంకర్ అనే వ్యక్తి బైక్పై వెళ్తుండగా, అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికెన్ సెంటర్ల వ్యర్థాల వల్ల రోడ్లపై కుక్కలు, పందుల సంచారం పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.