KMR: డోంగ్లి మండల బీజేపీ అధ్యక్షుడు ధనుంజయ్ పటేల్‌తో పాటు పలువురు కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వారికి పార్టీ కండువాలు వేశారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై కాంగ్రెస్‌లో చేరామని ధనుంజయ్ పటేల్ వివరించారు.