ADB: సమిష్టి కృషితోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని జిల్లా ఎంపీ నగేశ్ అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులతో బుధవారం సమావేశమై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.