GNTR: ప్రభుత్వ వైద్య కళాశాలలను జీవో 590 ద్వారా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేసే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 19న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగితేనే పేదల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.