GNTR: డీఎస్సీ 2025లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు బుధవారం మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో తమను దగా చేసిందని వారు వాపోయారు. మెరిట్‌ను విస్మరించి రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని, తమకు న్యాయం చేయాలని వారు జగన్‌ను కోరారు.