NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు అధ్యక్షతన విభాగాధిపతుల సమావేశం జరిగింది. విశ్వవిద్యాలయంలో అకడమిక్ వాతావరణాన్ని మెరుగుపరచాలని, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులకు తరగతులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.